ఒక
పెద్ద అడవిలో ఓ చింత చెట్టు ఉందంట. ఆ చెట్టుపై పొడవాటి ముక్కుతో ఒక నల్లటి
కాకి ఉందంట. అయితే ఆ చెట్టు కింద, ఆ కాకికి ఒక మాంసపు ముక్క దొరికిందంట. ఆ
కాకి మాంసపు ముక్కని తన పొడవాటి ముక్కుతో కరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి
ఇంకో చెట్టుపై వాలింది హాయిగా తిందామని. అదే సమయానికి అక్కడే ఆడుతూ పాడుతూ
ఉన్న నక్క , ఆ మాంసపు ముక్క వాసనని గమనించి, ఇంత రుచికరమైన వాసన ఎక్కడినుంచి
వస్తుందబ్బా అని వెతుకుతూ ఉందంట. అప్పుడు చెట్టుపై ఉన్న కాకి నోట్లో ఉన్న
మాంసపు ముక్కని చూసిందంట. అంతే, ఇంక ఆ మాంసపుముక్కని ఎలా కొట్టెయ్యాలి అని
ఆలోచించి, ఒక పథకం వేసుకుందంట.
No comments:
Post a Comment